కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది భక్తుల మృతి
- మంత్రాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం
- బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన రెడీమిక్స్ లారీ
- ఘటనలో 8 మంది కర్ణాటక భక్తులు అక్కడికక్కడే మృతి
- మరో 12 మందికి తీవ్ర గాయాలు.. ఆసుపత్రికి తరలింపు
- రాఘవేంద్ర స్వామి దర్శనానికి వెళ్తుండగా ఘటన
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శ్రీ రాఘవేంద్రస్వామి వారి దర్శనానికి వెళుతున్న భక్తుల వాహనం ప్రమాదానికి గురవడంతో 8 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మంది గాయపడ్డారు.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని చిక్మగళూరుకు చెందిన కొందరు భక్తులు బొలెరో వాహనంలో మంత్రాలయం బయలుదేరారు. వీరి వాహనం చిలకలడోన గ్రామ సమీపానికి రాగానే, ఎదురుగా వస్తున్న రెడీమిక్స్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదంలో మృతిచెందిన వారిని, గాయపడిన వారిని కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.